Reading Time: < 1 minute

రంగారెడ్డి: ACC సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి

Caption of Image.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శంకర్ పల్లి మండలం మహాలింగాపురం దగ్గర ఉన్న ఏసీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ప్రమాదవశాత్తూ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో మొత్తం 10 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ కార్మికులను తోటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. 

ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతను భట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్మికులు అందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా సమాచారం. సోమవారం (ఏప్రిల్ 27) మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటల సమయంలో ఒక్కసారిగా వీసిన తీవ్ర గాలులకు క్రేన్ కూలిపోయిందని కార్మికులు తెలిపారు. 

 

©️ VIL Media Pvt Ltd.