
చట్టాలపై విద్యార్థుల్లో అవగాహనకు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చట్ట సాక్షరత కార్యక్రమం చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో సోమవారం(ఏప్రిల్27) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా లీగల్ సెల్ సర్వేసెస్ అథారిటీ.. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 5వేల 711 స్కూళ్లల్లో చట్ట సాక్షరతా కార్యక్రమం నిర్వహించేందుకు సిద్దమవుతోంది. చట్ట సాక్షరతా కార్యక్రమం ద్వారా బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, బాలల హక్కుల దుర్వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. ప్రతి పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ను నియమించనున్నారు. లీగల్ టిలరసీ క్లబ్లులు, చైల్డ్ రైట్స్ క్లబ్లులు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. విద్యార్థులకు న్యాయ సహాయం, కౌన్సెలింగ్ సేవలను ఈ సాక్షరతా కార్యక్రమం ద్వారా అందుబాటులో తీసుకురానున్నారు. డ్రాప్అవుట్ పిల్లలను గుర్తింపు, తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు.