Reading Time: 2 minutes

రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై రౌడీల ఊచకోత.. ‘ది బ్లాక్ గోల్డ్’ కోసం ఆయుధం పట్టిన సంయుక్త!

Caption of Image.

మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ తన నటన, గ్లామర్ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘సార్’ వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించిన ఈ ‘గోల్డెన్ లెగ్’ భామ, ఇప్పుడు తన పంథా మార్చుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, మొదటిసారి తన భుజాలపై సినిమాను నడిపించేందుకు సిద్ధమైంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ సోలో ప్రాజెక్ట్ ‘ది బ్లాక్ గోల్డ్’ (The Black Gold).

యాక్షన్ మోడ్‌లో సంయుక్త

లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నిర్మానుష్యంగా ఉన్న రైల్వే ప్లాట్‌ఫారమ్ మీద, చేతిలో ఆయుధంతో రౌడీ మూకలను ఊచకోత కోసిన గెటప్‌లో సంయుక్త కనిపిస్తోంది. ఆమె కళ్లలోని తీక్షణత చూస్తుంటే, ఈ సినిమాలో భారీ స్థాయిలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.

కథా నేపథ్యం
దర్శకుడు యోగేశ్ కేఎంసీ ఈ చిత్రాన్ని బొగ్గు గనుల నేపథ్యంలో (నల్ల బంగారం) తెరకెక్కిస్తున్నారు.. బొగ్గు మాఫియా, గనుల చుట్టూ తిరిగే రాజకీయాలు, సామాన్యుల పోరాటం ఈ చిత్రంలో ప్రధానాంశాలని తెలుస్తోంది. సంయుక్త ఈ సినిమాలో కేవలం నటిగానే కాకుండా, సహా-నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది. హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ బ్యానర్లపై రాజేశ్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి శ్యామ్ సీఎస్ అందిస్తున్న నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది.

అయితే ఈ ‘ది బ్లాక్ గోల్డ్’ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ప్రస్తుతానికి సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. త్వరలోనే టీజర్, ట్రైలర్ అప్‌డేట్స్‌తో సందడి చేయనున్నారు. సంయుక్త ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడటం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన నటనతో, ఆటిట్యూడ్‌తో ‘బ్లాక్ గోల్డ్’ ద్వారా సంయుక్త టాలీవుడ్ యాక్షన్ క్వీన్‌గా మారుతుందని అభిపాయపడుతున్నారు.

ALSO READ : మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు బిగ్ రిలీఫ్..

బిజీ షెడ్యూల్‌లో బ్యూటీ

ప్రస్తుతం సంయుక్తా మీనన్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. ‘ది బ్లాక్ గోల్డ్’తో పాటు ఆమె మరికొన్ని భారీ ప్రాజెక్టుల్లో భాగమైంది. నిఖిల్ సిద్ధార్థ్ సరసన ఒక చారిత్రక నేపథ్యంలో సాగే ‘స్వయంభు’ చిత్రంలో నటిస్తోంది.  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి సరసన ఒక కీలక పాత్రలో కనిపించనుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కూడా ఒక్కో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టింది.

 

©️ VIL Media Pvt Ltd.