Reading Time: 2 minutes

ఎమ్మెల్సీలుగా ప్రొ. కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం

Caption of Image.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొ. కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2026 ఏప్రిల్ 27 (సోమవారం) శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఇద్దరికీ ఈ సందర్భంగా సీఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్సీలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. 

ప్రొ.జయశంకర్కు ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తా:  కోదండరాం

  • చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీగా  ప్రమాణ స్వీకారం చేశాను
  • లక్ష్యాలను  ఎంచుకొని పని చేస్తా
  • నాకు మంత్రి పదవి పై ఆశ లేదు
  • పీజు రియంబర్స్మెంట్, ఉద్యమ కారుల సమస్యలు, ఆదివాసుల సమస్యల పరిస్కారం కోసం పని చేస్తా
  • ఇప్పటి వరకు చేస్తున్న పనిని సమర్ధ వంతంగా పని చేయడానికి నాకు ఎమ్మెల్సీ ఉపయోగ పడుతుంది
  • అనేక కేసులు, అనేక ఇబ్బందులు పడ్డా
  • నా పని ఆగలేదు.. కొనసాగుతుంది
  • గతంలో ఏ రకంగా జీవన శైలి ఉందొ భవిషత్తులో కూడా అదేవిధంగా ఉంటుంది
  • ప్రజల కోసం నిలబడతా.. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటా
  • పదవులు అనేవి శాశ్వతం కాదు
  • ఒకాయన నేను పోరాడుతానా లేదా అని అన్నారు నేను పోరాడి చూపిస్తా  

అజారుద్దీన్ కామెంట్స్:

  • నాకు పొలిటికల్ ఫాన్స్ కంటే క్రికెట్ ఫాన్స్ ఎక్కువ.. 
  • పొలిటికల్ ఫాన్స్ ని కూడా పెంచుకుంటాను.
  • ప్రజల కోసం ఇంకా కష్టపడి పని చేస్తాను.
  • మైనారిటీ ల అభివృద్ధి కోసం కృషి చేస్తాను.
  • సీఎం రేవంత్  మైనారిటీ ల కోసం చాలా చేశారు.
  • రాజకీయాల్లో క్లీన్ బోల్డ్ ఉండదు
  • రాజకీయాల్లో చూస్తూ ఆడుకుంటూ వెళ్లిపోవాలి 

©️ VIL Media Pvt Ltd.