Reading Time: < 1 minute

మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బోరు బండి.. పది మందికి గాయాలు

Caption of Image.

మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సును బోరు బండి ఢీకొట్టడం భయాందోళనకు దారితీసింది. ఏప్రిల్ 26వ తేదీన నర్సాపూర్ బస్టాండు లోపలికి వెళ్తున్న బస్సును బోరు బండి లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు డ్యామేజ్ అయ్యింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

బస్టాండు లోలికి వెళ్తున్న బస్సును సైడ్ నుంచి బోర్ వెల్ బండి ఢీకొట్టడంతో ప్రయాణికులు భయాందోళనకు గరయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఏమీ కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

గజ్వేల్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు నర్సాపూర్ బస్టాండు లోపలికి వెళ్తుండగా..  హైదరాబాద్ రోడ్డు వైపు నుండి వస్తున్న బోర్ బండి లారీ ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు పది మంది వరకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.