Reading Time: < 1 minute

అంబానీల కోటలో పాప్ సింగర్ రిహన్నా.. పెద్ద పండగే చేశారుగా..!

Caption of Image.

పాప్ సింగర్ రిహన్నా అంబానీల ఇంటిని సందర్శించారు. ముంబై ట్రిప్ లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 26) అంటీలియా సౌధానికి చేరుకున్నారు. ఆమె కాస్మటిక్ బ్రాండ్ ఫెంటీ బ్యూటీ (Fenty Beauty) లాంచ్ సందర్భంగా అంబానీల ఆతిథ్యం స్వీకరించారు. రిహన్నా రాకతో రాకతో పెద్ద వేడుకే నిర్వహించారు. 

ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్ అంబానీ లు.. రిహన్నాను అంటిలియా సౌధంలోకి స్వయంగా ఆహ్వానించారు. సంప్రదాయ నృత్య ప్రదర్శనతో ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లారు. పూలు వెదజల్లుతూ ఆమెకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా అంబానీ ఫ్యామిలీ నిర్వహించిన హారతి పూజలో పాల్గొన్నారు రిహన్నా ఆమె టీమ్. ప్రత్యేకంగా నిర్వహించిన పూల హోళీ అతిథులను అలరించింది. ఆ తర్వాత ప్రత్యేకంగా భారతీయ వంటకాలతో ఏర్పాటు చేసిన లంచ్ లో పాల్గొన్నారు. 

ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డ్యాన్స్ ఫూటేజ్, ఇతర క్లిప్స్ కు మంచి స్పందన వస్తోంది. థ్యాంక్యూ ని హిందీలో ఎలా చెప్పాలి అని రిహన్నా అడిగే వీడియో.. రెడ్ కార్పెట్ పై ఫోటోకు ఫోజులిస్తున్న క్లిప్ వైరల్ అవుతున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.