
చందానగర్ లో దారుణం జరిగింది. ఓ హోటల్ లో మహిళను హత్య చేసి పరారయ్యాడు దుండగుడు. ఆదివారం ( ఏప్రిల్ 26 ) జరిగిన ఈ ఘటనలు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. చందానగర్ లోని నైట్ ఐ హోటల్ లో మహిళను హత్య చేసి పరారయ్యాడు గుర్తు తెలియని వ్యక్తి. మృతురాలు సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామానికి చెందిన నరసమ్మగా గుర్తించారు పోలీసులు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హోటల్ కు మహిళతో పాటు గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడని.. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి హోటల్ నుండి వెళ్లిపోయాడని అంటున్నారు సిబ్బంది. ఎంతసేపటికి మహిళ బయటికి రాకపోవడంతో అనుమానంతో డోర్ పగలకొట్టి లోపలి వెళ్లి చూడగా.. మహిళ విగతజీవిగా పడి ఉందని తెలిపారు సిబ్బంది.
మహిళను మెడ భాగంలో చున్నీతో బిగించి హత్య చేసి సాయంత్రం హోటల్ నుండి దుండగుడు పరారయ్యాడని తెలిపారు పోలీసులు. హోటల్ సిబ్బంది సమాచారంతో ఘటాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చందానగర్ పోలీసులు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.