Reading Time: < 1 minute

హైదరాబాద్ లో ఖుల్లా నూనెపై నిషేధం… H-Fast అధికారుల స్ట్రాంగ్ వార్నింగ్..

Caption of Image.

హైదరాబాద్ లో విడి నూనె అమ్మకాలపై నిషేధం విధించారు H-Fast అధికారులు. విడి నూనె అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. విడి నూనె విక్రయాలకు 15 రోజుల గడువు విధించిన అధికారులు గడువు తర్వాత విడి నూనె విక్రయాలు చేపడితే…క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

హైదరాబాద్‌లో విడి నూనె విక్రయాలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. H-FAST టీమ్ ఆధ్వర్యంలో బేగంబజార్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ క్రమంలో నూనె వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు డిసిపి గైక్వాడ్. విడి నూనె విక్రయాలకు 15 రోజుల గడువు విధిస్తున్నామని… గడువు తర్వాత ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ప్రతి నూనె ప్యాకెట్ తప్పనిసరిగా సీల్ చేసి అమ్మాలని.. తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్, బ్యాచ్ నంబర్, FSSAI లేబులింగ్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కల్తీ నూనె దొరికితే లైసెన్స్ రద్దుతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని తెలిపారు.రిఫైనరీలు, నిల్వ కేంద్రాల్లో పరిశుభ్రత నిబంధనలు తప్పనిసరిగా ఫాలో అవ్వాలని సూచించారు. తక్కువ ధరకు విడి నూనె కొనొద్దని ప్రజలకు సూచించారు పోలీసులు.

©️ VIL Media Pvt Ltd.