
సీఎం రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో పాల్గొన్నారు. వెబ్ సైట్ లో స్వయంగా వివరాలను నమోదు చేసుకున్నారు. 2027 జనగణనలో భాగంగా తెలంగాణలో ఇవాళ (ఏప్రిల్ 26) నుంచి ఆన్‌లైన్‌లో స్వీయ గణన ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికారుల సమక్షంలో సీఎం తన వివరాలను నమోదు చేసుకున్నారు.
జనాభా లెక్కల కార్యక్రమంలో ముందుగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించి సెన్సస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జనగణనలో స్వయంగా నమోదు చేసుకునే విధానాన్ని గురించి చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అత్యంత కీలకమైన జనగణన కార్యక్రమంలో ప్రజలంతా విశేషంగా పాల్గొని వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ , జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక ఆల, సమాచార పౌర సంబంధాల కమిషనర్ సీహెచ్. ప్రియాంక తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.