
ప్రతిరోజూ ట్యాబ్లెట్స్ వేసుకునేవాళ్లకు ఈ వాటర్ బాటిల్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని డీఎస్ ఎంటర్ప్రైజ్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇది 2 ఇన్ 1 డిజైన్ తో వస్తుంది. కాబట్టి వేరుగా మెడిసిన్ బాక్స్ మెయింటెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ బాటిల్ లో ట్యాబ్లెట్స్ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఆర్గనైజర్ ఉంటుంది.
అందులో 7 కంపార్ట్మెంట్లు ఉంటాయి. వారంలో ప్రతి రోజుకు ఒక్కో కంపార్ట్మెంటిని కేటాయించొచ్చు. ఒక్కో కంపార్ట్మెంట్ లో 3 నుంచి 5 ట్యాబ్లెట్స్ పెట్టుకోవచ్చు. నీళ్లు, మెడిసిన్ ఒకే చోట ఉండటం వల్ల హెల్త్ రొటీన్ మెయింటెయిన్ చేయడం ఈజీ అవుతుంది. ఈ బాటిల్ 750ఎంఎల్ కెపాసిటీతో వస్తుంది. లీక్ ప్రూఫ్ డిజైన్ రావడం వల్ల జర్నీ టైంలో కూడా ఇబ్బందిగా ఉండదు. ఒకవేళ పిల్ కంపార్ట్మెంట్ వద్దనుకుంటే దాన్ని స్లైడ్ చేసి తీసేసి, నార్మల్ వాటర్ బాటిల్ కూడా వాడుకోవచ్చు. దీన్ని బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్తో తయారుచేశారు. లైట్ వెయిట్, పోర్టబుల్ డిజైన్తో వస్తుంది. ట్రావెల్, ఆఫీస్, జిమ్లకు సులభంగా తీసుకెళ్లొచ్చు.