Reading Time: < 1 minute

తిరుమల కొండ కిట కిట.. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్ స్వామి దర్శనానికి 18 గంటల సమయం

Caption of Image.

తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతోంది.  శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టిటిడి అధికారులు తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు యాత్రికులతో నిండిపోయాయి. వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో వేచి ఉన్నట్లు తెలిపారు. 
రూ.  300  శీఘ్రదర్శనంకు  3-నుంచి 4  గంటల సమయం పడుతుండగా…సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది.యాత్రికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నిన్న(2026 ఏప్రిల్​ 25 శనివారం) శ్రీవారిని 80 వేల 350 మంది భక్తులు దర్శించుకున్నారు.  36 వేల597 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు

 

©️ VIL Media Pvt Ltd.