Reading Time: 2 minutes

SSC నోటిఫికేషన్ విడుదల: మొత్తం 731 పోస్టులు.. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశం..

Caption of Image.

కేంద్ర ప్రభుత్వంలోని ప్రతిష్టాత్మక మంత్రిత్వ శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొలువు సాధించాలనుకునే నిరుద్యోగులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్​సీ) తీపి కబురు అందించింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి & డి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండి, స్టెనోగ్రఫీలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 731 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 24 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉద్యోగం, స్థిరమైన కెరీర్ ఆశించే వారికి ఇది సరైన సమయం.

పోస్టు పేరు: స్టెనోగ్రాపర్ గ్రేడ్ –సి, డి.

మొత్తం ఖాళీలు: 731

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి 12వ తరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం  తప్పనిసరిగా కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 24.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​లకు రూ.100 . ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు 
లేదు. 

లాస్ట్ డేట్: మే 16.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: 2026 జులై– ఆగస్టు (తాత్కాలికం).

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్ట్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు  వెబ్​సైట్     www.ssc.gov.inను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్
కంప్యూటర్ బేస్ట్ టెస్టులో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం మూడు భాగాలు  ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్50 ప్రశ్నలు 50 మార్కులకు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. ప్రశ్నల స్థాయి 12వ తరగతిస్థాయి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.  నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. పరీక్షను వేర్వేరు షిఫ్టుల్లో నిర్వహిస్తారు కాబట్టి, అభ్యర్థుల మార్కులను నార్మలైజేషన్ పద్ధతి ద్వారా మెరిట్ లెక్కిస్తారు. 

కనీస అర్హత మార్కులు: అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ/ అన్ రిజర్వ్డ్ 25 శాతం, ఇతరులు 20 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. 

స్కిల్ టెస్ట్
కంప్యూటర్ బేస్డ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులను స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ కోసం పిలుస్తారు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ పరీక్ష మాత్రమే. 
గ్రేడ్ –సి: నిమిషానికి 100 పదాల వేగం (100 డబ్ల్యూపీఎం).
గ్రేడ్ –డి: నిమిషానికి 80 పదాల వేగం (80 డబ్ల్యూపీఎం).

సిలబస్ 
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: ఇందులో అనాలజీస్, సిమిలారిటీస్, స్పేషియల్ విజువలైజేషన్, ప్రాబ్లం సాల్వింగ్, అనాలిసిస్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, రిలేషన్ షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్ వంటి అంశాలు ఉంటాయి.

జనరల్ అవేర్‌నెస్: ప్రస్తుత సామాజిక అంశాలు, కరెంట్ అఫైర్స్, భారతదేశ చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం, ఆర్థిక రంగం, పాలిటీ, శాస్త్రీయ పరిశోధనల గురించి ప్రశ్నలు అడుగుతారు.

ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్: అభ్యర్థికి ఇంగ్లిష్ భాషపై ఉన్న పట్టును పరీక్షించేలా వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటోనిమ్స్, కాంప్రహెన్షన్ పాసేజ్‌లు ఉంటాయి.

©️ VIL Media Pvt Ltd.