
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గురువారం(ఏప్రిల్23) ఉదయం 7 గంటలనుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. తమిళనాడుకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ,డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కుటుంబ సమేతంగా చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. టీవీకే చీఫ్ విజయ్ చెన్నైలో ఓటువేశారు. అలాగే సూపర్ స్టార్ రజినీ కాంత్ చెన్నైలోని స్టెల్లా మారీస్ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అంతకుముందు సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం శివగంగలోని కారైకుడిలో ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుని, సిరా గుర్తు ఉన్న తన వేలిని చూపించారు. ఎఐఎడిఎంకె జనరల్ సెక్రటరీ, లోపి ఎఐఎడిఎంకె అభ్యర్థి కె. పళనిస్వామి సిలువంపాళయంలోని పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు.MNM అధినేత, నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్‌తో కలిసి ఆల్వార్‌పేట పాఠశాలలో క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ మైలాపూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్, చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక సినీ ప్రముఖలలో ప్రముఖ నటుడు అజిత్ కుమార్, గౌతమ్ రామ్ కార్తీక్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని తిరువాన్మియూర్‌లో ఓ పోలింగ్ కేంద్రంలో అజిత్ కుమార్ తన ఓటు వేశారు.నటుడు గౌతమ్ రామ్ కార్తీక్ చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
#WATCH | Tamil Nadu Elections 2026 | Vijay, TVK chief and candidate from Tiruchirappalli East and Perambur constituencies, cast his vote at a polling station in Chennai.
(Video Source: TVK) pic.twitter.com/PrFigiQ3iJ
— ANI (@ANI) April 23, 2026