
- ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంపై ఘోష్ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదని, ఇది రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు తెలుసుకొని సంబురాలు చేసుకుంటే మంచిదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.
బుధవారం కోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్ తీర్పు కాదని, త్వరలోనే బీఆర్ఎస్ నేతల బండారం బయటపడుతుందని చెప్పారు. బీజేపీతో చేతులు కలిపితే తమ తప్పులన్నీ మాఫీ అయిపోతాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని, అందుకే హరీశ్ రావు ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.