
కాచిగూడ, వెలుగు: నకిలీ నంబర్ ప్లేట్‌ను ఉపయోగిస్తూ ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన ఇద్దరిని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. రామంతాపూర్‌కు చెందిన షేక్ అబ్బు బాబా, షేక్ రిహాన్ తమ హీరో గ్లామర్ బైక్ అసలు నంబర్‌ను మార్చి, మరొక వాహనానికి చెందిన నంబర్ అమర్చారు. దీంతో చలానాలన్నీ కూకట్‌పల్లికి చెందిన అసలు వాహన యజమాని ఎ. లక్ష్మి పేరిట నమోదవుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఆధారంగా నిందితులను బుధవారం పట్టుకుని, కేసు నమోదు చేశారు.