
పాల్వంచ, వెలుగు : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్లో జాతీయ మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల విజయభాస్కర్ రావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులకు వైద్య సదుపాయాలు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ, ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో త్వరలో ప్రారంభించనున్న సంఘ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కావలసిందిగా ఆహ్వానించారు.