
యాదాద్రి భువనగిరి జిల్లాలో పల్నాడు ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా సుమారు గంటకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
బుధవారం ( ఏప్రిల్ 22 ) సాయంత్రం సికింద్రాబాద్ నుంచి పల్నాడు బయలుదేరిన రైలు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్ చేరుకోగానే నిలిచిపోయింది.
సాంకేతిక లోపం కారణంగా గంటకు పైగా రైలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు ప్రయాణికులు. గంట సేపటి నుంచి పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. చిన్న పిల్లలు, వృద్దులు ఇబ్బంది పడుతున్నారని.. అధికారులు వెంటనే స్పందించి రైలు త్వరగా కదిలేలా చూడాలని కోరుతున్నారు ప్రయాణికులు.