Reading Time: < 1 minute

రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

Caption of Image.

రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చెయ్యడమే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. బుధవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు సబ్ స్టేషన్ పరిధిలో 2.40 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 32 కేవీ సబ్ స్టేషన్ కు భూమిపూజ చేశారు. అనంతరం మండలంలోని చెప్యాల, కొడిమ్యాల, రామకృష్టాపూర్, గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ అందించడానికి మండలంలో నూతన సబ్ స్టేషన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు సెంటర్లలో వడ్లను అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. సన్న వడ్లను 500 రూపాయల బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో కొడిమ్యాల సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, నేరేళ్ల మహేష్, తైదల అంజయ్య, నాయకులు మేనేని రాజ నర్సింగ రావు, ముత్యం శంకర్, కొండూరి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.