Reading Time: 2 minutes

లక్నో బౌలర్ల ధాటికి రాజస్థాన్ విలవిల.. LSG టార్గెట్ ఎంతంటే!

Caption of Image.

ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టుకి ఆదిలోనే లక్నో బిగ్ షాక్ ఇచ్చింది. లక్నో బౌలర్ల ధాటికి రాజస్థాన్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కి క్యూ కట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఆర్ఆర్ జట్టు 159 పరుగులు మాత్రమే చేసింది. దీంతో లక్నో ముందు 160 రన్స్ టార్గెట్ ఉంది.

క్రీజులోకి వచ్చిన ఆర్ఆర్ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్– వైభవ్ సూర్యవంశీ ధాటిగా బ్యాటింగ్ చేసే క్రమంలో ఫస్ట్ వికెట్ కి 32 పరుగులు నెలకొల్పిన తర్వాత మహమ్మద్ షమీ బౌలింగ్ (2.5 ఓవర్లో)లో భారీ షాట్ ఆడబోయి కీపర్ రిషభ్ పంత్ కి క్యాచ్ ఇచ్చి జైస్వాల్ (12 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు) పెవిలియన్ కి చేరుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన ధృవ్ జురెల్(0) షమీ బౌలింగ్ (2.6 ఓవర్లో)లోనే లక్నో కెప్టెన్ పంత్ కి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్ గా మైదానం వీడాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన మొహ్సిన్ ఖాన్ అద్భుతమైన బంతులతో యంగ్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని కట్టడి చేయడంతో పాటు చివరి బంతి (3.6 ఓవర్లో)కి ఔట్ చేయడంతో పాటు ఈ ఓవర్ ని మెడిన్ కూడా చేశాడు. 

దీంతో 32 పరుగులకే కీలకమైన మూడు వికెట్లని కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ ని ఆదుకునేందుకు వచ్చిన  కెప్టెన్ రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మెయర్‌ జోడి ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో 62 పరుగుల వద్ద రియాన్ పరాగ్ (20)ని ప్రిన్స్ యాదవ్ పెవిలియన్ కి పంపించగా. ఆ తర్వాత కాసేపటికే హెట్‌మెయర్‌  (22) కూడా మొహ్సిన్ ఖాన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దీంతో 77 పరుగులకే కీలకమైన 5 వికెట్లని రాజస్థాన్ రాయల్స్ జట్టు నష్టపోయింది. 

అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన డొనొవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా నెమ్మదిగా జట్టు స్కోర్ బోర్డుని ముందుకు నడిపిస్తుండగా, 110 పరుగుల వద్ద ఫెరీరా (20) ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో మొహ్సిన్ ఖాన్ కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. దీంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాజస్థాన్ ని జడ్డేజా– శుభమ్ దూబే (19 నాటౌట్) ముందుకు నడిపించారు. 43 పరుగులతో రాజస్థాన్ జట్టులో టాప్ స్కోరర్ గా జడ్డూ నిలిచాడు. ఇక లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ రెండు వికెట్లు తీసుకోగా, మొహ్సిన్ ఖాన్ మెడిన్ ఓవర్ తో పాటు వికెట్ పడగొట్టాడు. 
 

©️ VIL Media Pvt Ltd.