
హైదరాబాద్ లో దారుణం జరిగింది. మూడేళ్ళ బాలుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి మృతి చెందాడు. బుధవారం ( ఏప్రిల్ 22 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నార్సింగిలోని రాజపుష్ప ప్రావిన్సియా అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న దినేష్ అనే వ్యాపారవేత్త కుమారుడు రిషాన్ ఏప్రిల్ 16న ఉదయం 11 నుంచి 11:30 గంటల మధ్య అపార్ట్మెంట్ క్లబ్ హౌస్ లోని స్విమ్మింగ్ పూల్ లో ప్రమాదవశాత్తు పడి మునిగిపోయాడు.
విషయం తెలిసిన వెంటనే బాలుడి తల్లి ఫోన్ ద్వారా దినేష్ కు సమాచారం అందించింది. ఘటన జరిగిన సమయంలో విశాఖపట్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలుడిని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లోని మెడికవర్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. హైదరాబాద్ చేరుకున్న బాలుడి తండ్రి దినేష్ డాక్టర్లను సంప్రదించి బాలుడిని రెయిన్ బో ఆసుపత్రికి తరలించారు.
ALSO READ : సమ్మె వద్దు.. మాయా మాటలు నమ్మొద్దు
రెయిన్ బో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తుండగా… బుధవారం ( ఏప్రిల్ 22 ) ఉదయం మరణించాడు రిషాన్. బాలుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.