
మనకు కొంచెం ఒళ్లు నొప్పులున్నా, జ్వరం వచ్చినా వెంటనే వేసుకునే మాత్ర ఐబుప్రోఫెన్. ఈ ట్యాబ్లేట్ చాలా సులభంగా ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి మనం పెద్దగా ఆలోచించకుండా వాడేస్తుంటాం. కానీ, వీటిని ఎక్కువగా వాడటం అస్సలు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువగా వాడితే వచ్చే సమస్యలు
*వీటిని ఎక్కువగా వాడితే జీర్ణాశయంలో అంటే కడుపులో పుండ్లు రావడం, రక్తస్రావం జరగడం వంటివి జరగవచ్చు. కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే ప్రమాదంలో పడే వకాశం ఉంది
*మన కడుపులో ఆమ్లం నుంచి రక్షణ కల్పించే పొర ఉంటుంది. ఈ మందులు ఆ రక్షణ పొరను బలహీనపరుస్తాయి. దీనివల్ల కడుపులో మంట, ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.
*ఒకవేళ లోపల రక్తస్రావం మొదలైతే, రక్తం త్వరగా గడ్డకట్టకుండా ఈ మందులు అడ్డుకుంటాయి. దీనివల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది.
ALSO READ : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా ?
ఎవరికి ఎక్కువ ప్రమాదం
*ఎక్కువ కాలం లేదా అధిక మోతాదులో ఈ మాత్రలు వేసుకునే వారికి.
*అలవాటుగా మద్యం సేవించే వారికి లేదా ధూమపానం చేసే వారికి.
*ఇంతకుముందే కడుపులో అల్సర్లు ఉన్నవారికి.
*వృద్ధులకు ఈ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మీరు ఈ మాత్రలు వాడుతున్నప్పుడు మలం నల్లగా రావడం, వాంతుల్లో రక్తం పడటం, కడుపులో విపరీతమైన నొప్పి రావడం, తల తిరగడం లేదా కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరు సంప్రదించడం మంచిది.
గుర్తుంచుకోండి ఇబుప్రోఫెన్ ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది.. కానీ దానిని అవగాహన లేకుండా వాడకూడదు. చిన్న చిన్న నొప్పులకు కూడా సొంతంగా మందులు వాడటం కంటే, డాక్టర్ సలహా తీసుకోవడం ఎంతో మేలు. అలవాటుగా వేసుకునే ఒక్క మాత్ర భవిష్యత్తులో పెద్ద అనారోగ్యానికి కారణం కావచ్చు. ఈ సమస్యలు నిశ్శబ్దంగా పేరుకుపోయి, అకస్మాత్తుగా బయటపడగలవనేదే అసలు విషయం.