Reading Time: < 1 minute

లీటర్ పెట్రోల్పై 25 రూపాయలు పెరిగే అవకాశం..!

Caption of Image.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 25 రూపాయల నుంచి 28 రూపాయల దాకా పెరగొచ్చని కోటక్ ఈక్విటీస్ అంచనా వేసింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని, అధిక ముడి చమురు ధరల కారణంగా రిఫైనరీలపై ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో.. లీటరుకు రూ.25 నుంచి రూ.28 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని దేశీయ బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ హెచ్చరించింది.

క్రూడ్ ఫ్యూచర్స్, ఫిజికల్ మార్కెట్ల మధ్య అంతరం పెరుగుతోందని కోటక్ ఎత్తిచూపింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇండియన్ క్రూడ్ బాస్కెట్ విపరీతంగా పెరిగింది. దిగుమతుల పరిమాణంలో 13–15% తగ్గుదల ఉన్నప్పటికీ, ముడి చమురు దిగుమతుల బిల్లు రోజుకు సుమారు $190–210 మిలియన్ల మేర పెరిగింది. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటివరకు మారలేదు.

కోటక్ ప్రకారం, దీనివల్ల రిఫైనర్లపై భారం పెరుగుతోంది. దీని వలన నెలకు సుమారు ₹270 బిలియన్ల అదనపు భారం పడుతుందని అంచనా. ప్రభుత్వం లీటరుకు రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి, విండ్‌ఫాల్ ఎగుమతి పన్నులను పునరుద్ధరించినప్పటికీ, ఈ చర్య పాక్షిక ఉపశమనాన్ని మాత్రమే ఇచ్చింది. ఏప్రిల్ 29న చివరి దశ పోలింగ్ జరగనున్నందున.. ఎన్నికలు ముగిసిన తర్వాతే పెట్రోల్, డీజిల్ ధరలను సవరించే అవకాశం ఉందని కోటక్ ఈక్విటీస్ తెలిపింది. ముడి చమురు ధరల్లో అస్థిరత కొనసాగుతున్నందు వల్ల.. రాబోయే కొన్ని వారాల్లో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

©️ VIL Media Pvt Ltd.