
తమిళనాడు అసెంబ్లీకి, రేపు గురువారం (ఏప్రిల్ 23, 2026న) ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. గత రెండు నెలలుగా ఈ మూడు పార్టీల మధ్య ఎత్తులు పై ఎత్తులు, అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక ఆ తతంగం అంతా ముగిసి.. ఓటు వేసే సమయం దగ్గరపడింది. రేపు గురువారం ఏప్రిల్ 23న ఉదయం ఓటింగ్ మొదలవ్వనుంది. ఈ సందర్భంగా తమిళ స్టార్ హీరో, రేసర్ అజిత్ కుమార్ ఓటు వేయడానికి విదేశాల నుంచి ఇండియాకి తిరిగి రావడంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఓటు కోసమే.. విదేశాల నుంచి..
తమిళనాడులో రేపు ఏప్రిల్ 23న ఉదయం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా తమిళ హీరో అజిత్ కుమార్ ఓటు హక్కు వినియోగించేందుకు బెల్జియం నుంచి చెన్నైకు తిరిగి వచ్చారు. అంతర్జాతీయ రేసింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, తన ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించేందుకు సమయం కేటాయించడం గొప్ప విషయమని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
𝐖𝐄𝐋𝐂𝐎𝐌𝐄 𝐁𝐀𝐂𝐊 𝐌𝐘 𝐂𝐇𝐈𝐄𝐅🙇♂️#AjithKumar #AK #AK64 @Akracingoffl @SureshChandraa pic.twitter.com/QsgaFjPNcO
— ♠️ AjithAzar ♠️ (@AjithAzar25) April 21, 2026
బుధవారం ఏప్రిల్ 22న చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తలా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ‘ఇది కదా కర్తవ్యం.. ఇండియాకి మెడల్స్ ఇవ్వడమే కాదు.. పౌరుడిగా తన విధిని నిర్వర్తించడంలో కూడా తలా ముందుంటాడని’ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. 2026, మే 4న కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి.
అజిత్ ఎక్కడ ఓటు వేయనున్నాడు..
చెన్నైలోని తిరువన్మియూర్ నియోజకవర్గంలో నటుడు అజిత్ కుమార్ ఓటు వేయనున్నారు. ప్రతి ఎన్నికలోనూ తన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకుంటూ వస్తున్నారు అజిత్ కుమార్. షూటింగ్ లతో బిజీగా ఉన్నా, రేసింగ్ పోటీలతో విదేశాల్లో ఉన్నా, తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో అజిత్ ముందుంటాడు. ఈ క్రమంలోనే అజిత్ రేపు ఉదయం పోలింగ్ బూత్ వద్ద ముందుగానే చేరుకుని సాధారణ ప్రజలతో పాటు క్యూలో నిలబడి ఓటు వేయనున్నాడు.
అజిత్ ఓటు ఎవరికీ..
అజిత్ కుమార్, రాజకీయాలపై తన వైఖరిని గతంలోనే స్పష్టంగా వెల్లడించారు. తాను రాజకీయాల్లో లేనని, తమిళనాడులోని ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వనని పలు సందర్భాల్లో తెలిపారు. అంతేకాదు, “నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వను” అంటూ ఒక అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. తన సినిమా కెరీర్ మరియు కార్ రేసింగ్‌పైనే దృష్టి సారించానని ఆయన స్పష్టం చేశారు కూడా!
అయితే, ఇటీవలి కాలంలో కొందరు అజిత్ అభిమానులు TVK పార్టీలో చేరారని కోలీవుడ్ వర్గాలు మాట్లాడుకున్నాయి. ఈ క్రమంలోనే అజిత్ పరోక్షంగా విజయ్ పార్టీకి మద్దతు ఇస్తున్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. కానీ, ఈ విషయంపై అజిత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమా? కాదా? అన్నది స్పష్టత రాలేదని చెప్పాలి.
ALSO READ : భాగ్యనగరంలో బాస్ ఇంటికి దగ్గర్లో భాయ్ నయా హౌస్..
అజిత్ రేసింగ్ షెడ్యూల్..
ఎన్నికల అనంతరం అజిత్ కుమార్ ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్, పోర్చుగల్ వంటి యూరప్ దేశాల్లో జరిగే రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనేందుకు తిరిగి వెళ్లనున్నారు. ఇటీవల బెల్జియంలోని ఫెమస్ ట్రాక్ Circuit de Spa-Francorchamps లో జరిగిన ప్రతిష్టాత్మక 24H Series ఎండ్యూరెన్స్ రేసులో అజిత్ కుమార్ జట్టు అద్భుత ప్రదర్శనతో రెండవ స్థానం (P2) సాధించింది. ఈ విజయం భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది.
We hear your enthusiasm ! None of these podiums are without your prayers and support. Thank you all, it certainly motivates us to push our boundaries ! #AjithKumar #AjithKumarRacing #AjithRedantRacing 🏆🇮🇳🏁🏎️ @Akracingoffl pic.twitter.com/V7fd1f25dR
— Ajithkumar Racing (@Akracingoffl) April 21, 2026