Reading Time: < 1 minute

బిగ్ బ్రేకింగ్ : ఇండియా ఆయిల్ నౌకను నిర్బంధించిన ఇరాన్

Caption of Image.

హర్మూజ్ జల సంధి దగ్గర ఇప్పుడు హై టెన్షన్. ఇరాన్ దేశంపై కాల్పుల విరమణను ట్రంప్ రెండు వారాలు పొడిగించిన తర్వాత ఈ ప్రాంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హర్మూజ్ జల సంధి దాటుతున్న రెండు భారీ నౌకలను నిర్బంధించింది ఇరాన్ కు చెందిన IRGC ఆర్మీ. హర్మూజ్ జల సంధి దాటుతున్న సమయంలో.. ఈ రెండు నౌకలను చుట్టుముట్టి.. వాటిని ఇరాన్ దేశంలోని పోర్టులకు తరలించారు. 

ఈ రెండు షిప్పుల్లో ఒకటి ఇండియాది. దుబాయ్ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకొస్తుంది ఈ నౌక. దుబాయ్ నుంచి వస్తూ హర్మూజ్ జల సంధి దాటుతున్న సమయంలో ఇరాన్ ఆర్మీ.. ఈ నౌకను చుట్టుముట్టి వార్నింగ్ ఇచ్చింది. హర్మూజ్ జల సంధి దాటటానికి అనుమతి లేదని.. మా హెచ్చరికలను ఖాతరు చేస్తే నౌకను పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు IRGC ఆర్మీ. హర్మూజ్ జల సంధి నుంచి ఇరాన్ పోర్టుకు ఆ నౌకను తరలించారు.

ఈ నౌక ఇండియాలోని గుజరాత్ రాష్ట్రం ముంద్రా పోర్టుకు రావాల్సి ఉంది. ఈ నౌకకు ఇండియా జెండా ఉంది. అయినా కూడా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దాడి చేయటం ఇప్పుడు కలకలం రేపుతోంది. హర్మూజ్ జల సంధి ఓపెన్ అయినట్లు అమెరికా పదే పదే చెబుతున్నా.. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగిస్తున్నట్లు ట్రంప్ చెబుతున్నా.. హర్మూజ్ జల సంధి దగ్గర సిట్యువేషన్ మరోలా ఉంది. 

ALSO READ : ట్రంప్ మాటను లెక్కచేయని ఇరాన్..

ఇండియన్ నౌకకు  ఎలాంటి ప్రమాదం లేదని.. నౌకలోని సిబ్బంది క్షేమంగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇండియా జెండా ఉన్న నౌకపై దాడి చేయటాన్ని ఖండించింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయం తెలిసిన వెంటనే.. భారత్ లోని ఇరాన్ రాయబారికి ఈ సమాచారం అందజేశారు మన అధికారులు. IRGC.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సీజ్ చేసిన షిప్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.