Reading Time: 2 minutes

Krunal Pandya: హార్దిక్‌ పాండ్యాతో గొడవలపై మౌనం వీడిన కృనాల్ పాండ్యా.. ఏం చెప్పారంటే?

Caption of Image.

Krunal Pandya: టీమిండియా క్రికెట్‌లో పాండ్యా సోదరుల గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, గతంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో కలిసి ఆడారు. ఇప్పుడు కృనాల్ ఆర్సీబీ తరపున ఆడుతుండగా, హార్దిక్ ముంబై జట్టు సారథిగా కొనసాగుతున్నాడు. వారిద్దరూ వేర్వేరు జట్లలో ఉన్నప్పటికీ, వారి బంధం అలాగే కొనసాగింది. కానీ గత కాలంగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై తాజాగా కృనాల్ మౌనం వీడాడు.

హార్దిక్ పాండ్యా గతంలో నటాషాను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు హార్దిక్ మహికా శర్మతో ప్రేమలో ఉన్నాడు. మహికాతో డేటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత హార్దిక్ ప్రవర్తన పూర్తిగా మారిందని వార్తలు వస్తున్నాయి. హార్దిక్ – కృనాల్ విడిపోవడానికి మహికానే కారణమని కూడా ప్రచారం జరుగుతుంది. గతంలో ముంబై వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్‌లో హార్దిక్ వికెట్ పడినప్పుడు కృనాల్ చేసిన సంబరాలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ ఆ మారింది. దీంతో అభిమానుల్లో అనుమానాలు మరింత పెరిగాయి. 

Also Read : LSG vs RR మధ్య గెలుపు కోసం ఆరాటం

ఇక కృనాల్ పాండ్యా ఇప్పుడు ఆర్‌సీబీకి సపోర్టుగా నాగ్స్‌తో చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘గత సంవత్సరం మీరు నన్ను ఇంటర్వ్యూ చేయలేదు,’ అని నాగ్స్ అన్నాడు. దీనికి కృనాల్, ‘నేను ఆర్సీబీ కుటుంబంతో ఉన్నాను,’ అని రిప్లై ఇచ్చాడు. ‘నేను కూడా ఆర్‌సీబీ కుటుంబంలో ఒక సభ్యుడినే.. మీరు ఆర్‌సీబీ ఫ్యామిలీతో ఉన్నందున, ఆర్‌సీబీ కుటుంబంలోని మరో సభ్యుడిని కలవలేకపోయారు, కదా?’ అని నాగ్స్ మళ్ళీ అడిగాడు. “మీ కుటుంబంలో చాలా మంది ఉన్నారు.. కొన్నిసార్లు కొందరిని మిస్ అవుతుంటామని కృనాల్ అన్నాడు. “మీ తమ్ముడి లాగానా?” అని నాగ్స్ అడగ్గా, కృనాల్ ఒక్కసారిగా నవ్వేశాడు. “ఏమైనా గొడవ జరుగుతోందా? దయచేసి చెప్పండి.. మీ ఇద్దరి మధ్య అంతా ఒకేనా అని అడిగిన ప్రశ్నకు “అంతా బాగానే ఉంది” అంటూ కృనాల్ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో హార్దిక్– కృనాల్ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ బయటకి అలా చెబుతున్నాడని నెట్టింట యూజర్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.