Reading Time: < 1 minute

బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు అవసరం…ఆర్బీఐ గవర్నర్ కు సీపీ సజ్జనార్ లేఖ

Caption of Image.

బషీర్​బాగ్, వెలుగు: సైబర్ నేరాలను అరికట్టాలంటే బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల ప్రక్షాళన అవసరమని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. సైబర్ ముఠాలకు ‘మ్యూల్ అకౌంట్లు’ వరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగర పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్’ దర్యాప్తులో వెలుగుచూసిన అంశాల ఆధారంగా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను వివరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు మంగళవారం లేఖ రాశారు. ఖాతాల ప్రారంభంలో కేవైసీ ధ్రువీకరణలో జరుగుతున్న నిర్లక్ష్యం ప్రధాన సమస్యగా ఉందని సీపీ పేర్కొన్నారు. బ్రాంచ్ స్థాయి అధికారులపై జవాబుదారీతనం నిర్ధారిస్తూ అన్ని వాణిజ్య బ్యాంకులకు కఠిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 

ఆర్బీఐ మార్గదర్శకాల అమలుపై తక్షణమే సిస్టమిక్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. ప్రజల సొమ్మును కాపాడాల్సిన కొంతమంది బ్యాంకు అధికారులే సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కవుతున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్ లో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ కేవైసీ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన లోపాలు భద్రతా వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు.  సైబర్ నేరాలకు సహకరించిన బ్యాంకు అధికారులను గుర్తించి ఆర్బీఐకి నివేదించి వారిని శాశ్వత బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చాలని సూచించారు. 

మ్యూల్ అకౌంట్లపై నిరంతర పర్యవేక్షణ కోసం ఆర్బీఐ, బ్యాంకులు, పోలీసులతో కూడిన జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి వేదికల్లో వచ్చే అధిక లాభాల ప్రకటనలను నమ్మవద్దని, ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట వచ్చే బెదిరింపులకు భయపడవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే ‘గోల్డెన్ అవర్’లో 1930 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్ చేయాలని లేదా అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.

©️ VIL Media Pvt Ltd.