Reading Time: < 1 minute

ట్రాఫిక్ పోలీసులకు మిస్ట్ ఫ్యాన్స్…ఎండ వేడి నుంచి ఉపశమనం

Caption of Image.

సైఫాబాద్, వెలుగు: మండుటెండల్లో రోడ్లపై నిలబడి విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బందికి ఉపశమనం కలిగించేందుకు హైదరాబాద్ పోలీస్ శాఖ వినూత్నంగా ‘మిస్ట్ పంప్స్​’ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. మంగళవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ఫ్యాన్ డెమోను జాయింట్ సీపీ జోయల్ డేవిస్, డీసీపీ అవినాశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశీలించారు. మోటార్ సహాయంతో నీటిని చిన్నపాటి పొగమంచులా (ఫాగ్) మారుస్తూ గాలిని అందించే ఈ ఫ్యాన్లు, పరిసర ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గిస్తాయని అధికారులు తెలిపారు. 

ఎండల తీవ్రత వల్ల సిబ్బంది అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రస్తుతానికి డెమో పరిశీలించామని.. సిబ్బంది నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా నగరం మొత్తం ప్రధాన జంక్షన్లలో వీటిని ఏర్పాటు చేస్తామని జాయింట్ సీపీ తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.