
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను దేశంలోనే ప్రముఖ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో మంగళవారం అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2026–2030 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా శ్రీధర్ బాబు, జనరల్ సెక్రటరీగా పుల్లెల గోపీచంద్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.