Reading Time: < 1 minute

ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటిన అల్ఫోర్స్

Caption of Image.

కరీంనగర్ టౌన్, వెలుగు: ఐఐటీ–జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ విద్యార్థులు జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించినట్లు సంస్థ చైర్మన్ వి.నరేందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఎం.శ్రీపార్టీష్ ఆల్ ఇండియా 29వ ర్యాంకుతో అత్యుత్తమ స్థానంలో నిలిచాడని చెప్పారు. సీహెచ్ లక్ష్మీహాసిని 116వ ర్యాంకు, సీహెచ్ పూర్ణచంద్ 138, ఎస్.వర్జినిరెడ్డి 211, ఎన్.రత్నప్రకాశ్ 239, పి.అక్షయ 250, ఎ.కీర్తన 274, యు.సిద్ధీశ్వర్ 459, కె ధనుష్ 556, కె.నచికేత్ 593, బి.లిఖిత్ సాయి 737, ఎం.వశిష్ట 884, కె.ప్రజ్ఞాన్ 991, రెడ్డి శ్రీకర్ 1000వ ర్యాంకు సాధించినట్లు వివరించారు. మొత్తంగా వెయ్యి లోపు 14 ర్యాంకులు, 2 వేల లోపు 18 ర్యాంకులు, 5 వేల లోపు 35 ర్యాంకులు వచ్చాయన్నారు. 450 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారని పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.