Reading Time: < 1 minute

కాసేపట్లో SRH vs DC హై-స్కోరింగ్ పోరు.. వర్షంతో మ్యాచ్ జరిగేనా!

Caption of Image.

SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ లో భాగంగా కాసేపట్లో (2026, ఏప్రిల్ 21) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ సొంత మైదానమైన ఉప్పల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తలపడనుంది. వరుస విజయాలతో ఊపుమీదున్న ఆరెంజ్ ఆర్మీ, గెలుపు బాటలో ఉన్న ఢిల్లీ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. కాగా ఉప్పల్ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. కాగా ఈ పిచ్‌పై ఇప్పటి వరకు 72 శాతం వికెట్లు పేసర్లే పడగొట్టారు. కొత్త బంతితో ఇక్కడ స్వల్పంగా స్వింగ్ లభించే అవకాశం ఉంది. ప్రారంభ ఓవర్లలో కచ్చితమైన లెంగ్త్ తో బౌలింగ్ చేసే బౌలర్లు ప్రమాదకరంగా మారవచ్చు.

ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆరంభంలో వికెట్లు పడకుండా బ్యాటర్లు క్రీజులో సెటిల్ అయితే మాత్రం పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కే మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్‌ గడ్డపై తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తుంటే, పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఢిల్లీ వారిని అడ్డుకోవాలని చూస్తోంది. మరీ ఈ రెండు జట్ల మధ్య పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి. 

►ALSO READ | క్రికెట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ హల్‌చల్.. పాయింట్ బ్లాంక్‌లో గన్‌ పెట్టి కెప్టెన్ చేయాలని ఒత్తిడి

మ్యాచ్‌కు ముందు వాతావరణం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్న అభిమానులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మధ్యాహ్నం వేళ ఉరుములతో కూడిన జల్లులు పడినప్పటికీ, మ్యాచ్ ప్రారంభ సమయానికి ఆకాశం క్లియర్ అయ్యే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం వచ్చే అవకాశం కేవలం 2 శాతం మాత్రమే ఉంది. సాయంత్రం ఉష్ణోగ్రత సుమారు 29 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే ఛాన్స్ ఉంది. వాతావరణం మేఘావృతంగా ఉంటే పేసర్లకు అదనపు సహకారం లభిస్తుంది.

 

©️ VIL Media Pvt Ltd.