
పార్లమెంట్ లో మహిళా కోటా బిల్లు వీగిపోయిన తర్వాత ప్రధాని మోదీ జాతినుద్దేశించిన చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. ప్రధాని ప్రసంగం ఎన్నికల నియమావళిని ఉల్లఘించడమే అని 700 మంది కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు లో ఉండగా.. అధికారిక మీడియాలో ప్రధాని మోదీ ప్రసంగించడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది.. చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతూ 700 మందికి పైగా పౌరులు ఈసీకి లెటర్ రాశారు. ఏప్రిల్ 23న తమిళనాడు,పశ్చిమ బెంగాల్ లలో ఎన్నికలు జరగనున్నాయి.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు అమలులో ఉండగాదూరదర్శన్, సంసద్ టీవీ, ఆల్ ఇండియా రేడియో వంటి అధికారిక మీడియాలో మోదీ ప్రసంగం చేయడం ఎన్రికల ప్రచారం కిందకే వస్తుందని తమ ఫిర్యాదులో ఈసీకి తెలిపారు. మొత్తం 700 మంది సంతకాలు చేసిన లెటర్ ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు.
ఏప్రిల్ 9న అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో మొదటి విడత ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 23 న పశ్చిమబెంగాల్ , తమిళనాడులలో మరో విడత పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు ఉంది.. అయినప్పటికీ ఏప్రిల్ 18న ప్రధాని మోదీ అధికారిక మీడియాలో జాతినుద్దేశించి ప్రసంగించడం కోడ్ ఉల్లంఘనకిందికే వస్తుందని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ నిధులతో నడిచే ఇటువంటి కార్యక్రమాల ద్వారా అధికార పార్టీకి ప్రయోజనం కల్పిస్తోందని, స్వేచ్చాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు అవసరమైన అవకాశాలను దెబ్బతీస్తోందని ఫిర్యాదు చేశారు.ఎం సీసీ నిబంధనలను గుర్తు చేస్తూ.. మంత్రులు తమ అధికారిక విధులను ఎన్నికల ప్రచారంతో లింకు చేయడం, వారి ప్రయోజనాలకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించడం వంటివి చేయరాదని ఫిర్యాదుదారులు తెలిపారు.
ఈ విషయాన్ని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలని, ప్రసంగంలోని విషయాలను, తీరును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రసారానికి ముందస్తు అనుమతి మంజూరు చేసి ఉంటే, ఇతర రాజకీయ పార్టీలకు కూడా ప్రభుత్వ ప్రసార మాధ్యమాల్లో సమాన ప్రసార సమయం కేటాయించాలని 700మంది సంతకాలు చేసిన ఫిర్యాదులో కోరారు.
ఫిర్యాదుచేసిన వారిలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, రాజకీయ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్, కార్యకర్త యోగేంద్ర యాదవ్, ఆర్థికవేత్త జయతి ఘోష్, సంగీత-రచయిత టీఎం కృష్ణ, యూనియన్ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ, కార్యకర్త హర్ష్ మందర్, జర్నలిస్టు పరంజోయ్ గుహ ఠాకుర్తా, విద్యావేత్త మదుమంబద్‌స్సాద్ ,మాజీ విద్యావేత్త జోయా హసన్ ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడటానికి కమిషన్ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు.