Reading Time: < 1 minute

ధాన్యం కొనుగోళ్లు పెంచండి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Caption of Image.

నల్లగొండ జిల్లాలో యుద్ద  ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పెంచాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండలోని మంత్రిక్యాంప్ కార్యాలయం  ఇందిరా భవన్ లో జిల్లా కలెక్టర్,  అధికారులతో రబీ ధాన్యం  సేకరణపై  సమీక్ష నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాత్రి,పగులు  ధాన్యం కొనుగోళ్లు జరిపి మిల్లులకు పంపించాలని కోరారు. ధాన్యం ఎక్కువగా వచ్చే గ్రామాలకు అదనంగా లారీలు పంపించాలన్నారు.  రోడ్లపై ధాన్యం పోయకుండా అవసరమైతే పాఠశాలు, ఫంక్షన్ హాల్స్ దగ్గర ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ వసతి కల్పించాలన్నారు. నల్లగొండ నియోజకవర్గం నుంచి  2లక్షల 30 వేల  మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ బి.చంద్రశేఖర్,అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,వై.అశోక్ రెడ్డి,పౌర సరఫరాల,వ్యవసాయ,మార్కెటింగ్,డి ఆర్ డి ఏ , డి సి ఓ,రవాణా అధికారులు,మిల్లర్లు  పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.