
గుర్తు తెలియని వ్యక్తులను లిఫ్ట్ అడిగితే ఎంత ప్రమాదమో చూడండి.. ఎండాకాలం.. మండి పోయే ఎండలు ఉండటంలో ఓ మహిళ గుర్తు తెలియని వ్యక్తిని లిఫ్ట్ అడిగి బైక్ పై వెళ్లగా అతను బెదిరించి ఆమెను నగలు దోచుకు పోయాడు. మహిళ అని చూడకుండా దారుణంగా కొట్టి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించాడు దుండగుడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే..
ముస్తాబాద్, వెలుగు: బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి ఓ మహిళ వద్ద నున్న నగలు ఎత్తుకుపోయిన ఘటన ఇది. ఎస్ఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామానికి చెందిన ఓ మహిళ మండలకేంద్రం వెళ్లేందుకు గుర్తుతెలియని వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. బైక్ ఎక్కించుకున్న అతను.. ఆమెను మాటల్లో పెట్టి వెంకయ్యకుంట గ్రామ శివారులోని ఓ కోళ్ల ఫామ్ వద్ద బైక్ ఆపాడు. ఆమెను బెదిరించి చెవి పోగులు, ముక్కు పోగులు.. సుమారు 3 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లాడు. రోడ్డు పక్కన కూర్చొని ఏడుస్తున్న మహిళను చూసిన కొందరు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.