
గంగాధర, వెలుగు: కరీంనగర్ జిల్లా గంగాధర సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో విజిలెన్స్ అండ్‌ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులు, భూ క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. ఇటీవల జరిగిన భూ రిజిస్ట్రేషన్లు, ఫీజుల లావాదేవీలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనుసరించిన విధానాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. పలు విభాగాలకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డ్ ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు సేకరించారు.
కాగా విజిలెన్స్ అధికారుల రాకను గమనించిన కార్యాలయ పరిసరాల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు తమ షటర్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. విజిలెన్స్ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఫీజుల వసూళ్లు, అధికారిక లావాదేవీలు నిబంధనలకు అనుగుణంగా జరిగాయా లేదా అని విచారించినట్లు సమాచారం.