Reading Time: 2 minutes

OTT Lovers Alert: ఓటీటీ థ్రిల్లర్ లవర్స్‌కు గోల్డెన్ వీక్.. 12 కొత్త సినిమాలతో పండుగే

Caption of Image.

ఆగస్టు తొలి వారంలో (ఆగస్టు 3–9, 2026) ఓటీటీ ప్రేక్షకులకు వినోదం డబుల్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు హాలీవుడ్ కంటెంట్ కూడా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి రానుంది. థ్రిల్లర్‌లు, మిలిటరీ డ్రామాలు, రొమాంటిక్ సిరీస్‌లు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ వంటి ప్రముఖ ఓటీటీ వేదికలు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించే ఆ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేయండి. 

1. ఉయిర్ (Uyir)

ఓటీటీ: JioHotstar
స్ట్రీమింగ్: ఆగస్టు 4

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో రోషన్ మాథ్యూ సబ్‌-ఇన్‌స్పెక్టర్ అజీబ్ రెహ్మాన్ పాత్రలో కనిపిస్తారు. చిన్ననాటి గాయాలను ఎదుర్కొంటూనే ఓ హత్య కేసును ఛేదించే కథాంశంతో సినిమా సాగుతుంది. ముఖ్యంగా ఈ మూవీకి స్టోరీని రియల్ పోలీస్ ఆఫీసర్ అందించడం విశేషం. 

2. కట్టాలన్ (Kattalan)

స్ట్రీమింగ్: మనోరమా మ్యాక్స్ (ManoramaMAX)
ఓటీటీ రిలీజ్: ఆగస్టు 7 

ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ అడవి నేపథ్యంలో సాగే సర్వైవల్ డ్రామా. ప్రకృతి మధ్యలో ఎదురయ్యే ప్రమాదాలు, ఉత్కంఠభరిత సంఘటనలతో సినిమా సాగుతుంది.

3. టెడ్ లాసో – సీజన్ 4

స్ట్రీమింగ్: Apple TV+
ఓటీటీ రిలీజ్: ఆగస్టు 5

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ సిరీస్ నాలుగో సీజన్‌తో తిరిగి వస్తోంది. ఈసారి మహిళల ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా టెడ్ చేసే ప్రయాణం ప్రధానాంశం.

ALSO READ :  కింగ్ 100కు రాక్‌స్టార్ DSP కన్ఫామ్..

4. స్టెర్లింగ్ పాయింట్ (Sterling Point)

స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్: ఆగస్టు 5

న్యూయార్క్‌లో పెరిగిన ఓ యువతి తనకు వారసత్వంగా వచ్చిన కెనడా ద్వీపానికి వెళ్లిన తర్వాత కుటుంబ రహస్యాలను తెలుసుకునే మిస్టరీ డ్రామా.

5. మై లైఫ్ విత్ ది వాల్టర్ బాయ్స్ – సీజన్ 3

స్ట్రీమింగ్: నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్: ఆగస్టు 6

ప్రేక్షకులను ఆకట్టుకున్న టీన్ రొమాంటిక్ డ్రామా మూడో సీజన్‌తో వస్తోంది. ప్రేమ, కుటుంబ బంధాలు, భావోద్వేగాల మధ్య చిక్కుకున్న జాకీ కథ కొనసాగుతుంది.

6. లెనిన్ (Lenin)

స్ట్రీమింగ్: జీ5 (ZEE5)
ఓటీటీ రిలీజ్: ఆగస్టు 7

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ ఓ గ్రామీణ యాక్షన్-డ్రామా. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కుటుంబ బంధాలు, ప్రేమ, సామాజిక సమస్యలు, రాజకీయ పరిణామాలను యాక్షన్ ఎలిమెంట్స్‌తో మేళవించి చూపించారు. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఆగస్టు 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. గ్రామీణ కథలు, ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం మంచి ఛాయిస్‌గా నిలుస్తుంది.

7. హృదయం మురళి (Idhayam Murali)

స్ట్రీమింగ్: నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్: ఆగస్టు 7

అథర్వా ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ రొమాంటిక్ కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా యువత భావోద్వేగాలు, ప్రేమ, జీవిత ప్రయాణాన్ని హృద్యంగా చూపిస్తుంది. ఇందులో ఫహద్ ఫాసిల్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు.

8. వదంతి: సీజన్ 2 (Vadhandhi Season 2)

స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్: ఆగస్టు 7

సూపర్ హిట్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ రెండో సీజన్ ఇది. ఈసారి మదురై నేపథ్యంలో రాజకీయ కుట్రలు, పాత కేసులు, కొత్త మిస్టరీలతో కథ మరింత ఉత్కంఠగా సాగనుంది.

9. ఆపరేషన్ సఫేద్ సాగర్ (Operation Safed Sagar)

స్ట్రీమింగ్: నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్: ఆగస్టు 7

1999 కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కిన దేశభక్తి ప్రధాన మిలిటరీ డ్రామా. సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్ కీలక పాత్రల్లో నటించారు.

10. మైన్ వాపస్ ఆవుంగా (Main Vaapas Aaunga)

స్ట్రీమింగ్: నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్: ఆగస్టు 7

95 ఏళ్ల వృద్ధుడు తన తొలి ప్రేమ, స్వగ్రామం జ్ఞాపకాలలో మునిగిపోవడం, అతని గతాన్ని వెతికే మనవడి భావోద్వేగ ప్రయాణం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది.

11. వందదేవుళ్లు 

స్ట్రీమింగ్: జీ5 (ZEE5)
ఓటీటీ రిలీజ్: జూలై 31 నుంచి స్ట్రీమింగ్ (ఈ వారం కూడా అందుబాటులో)

నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ తమిళ ఫ్యామిలీ డ్రామా.. తల్లి-కొడుకు అనుబంధం, త్యాగం, కుటుంబ విలువలను హృద్యంగా ఆవిష్కరిస్తుంది.

12. ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ (The Super Mario Galaxy Movie))

స్ట్రీమింగ్: జియోహాట్‌స్టార్ (JioHotstar)

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సూపర్ మారియో ఫ్రాంచైజీకి చెందిన ఈ యానిమేటెడ్ అడ్వెంచర్ మూవీ.. మారియో, లుయిగీ సరికొత్త సాహస యాత్రతో పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించనుంది.

©️ VIL Media Pvt Ltd.