
డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కు షాక్ ఇచ్చారు పార్టీ కార్యకర్తలు. సోమవారం ( ఆగస్టు 3 ) కావేరి జలాల సమస్యపై డీఎంకే నిర్వహించిన కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతుండగా… త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. ఉదయనిధి ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేసే సమయంలో కొంతమంది కార్యకర్తలు త్రిష నినాదాలు చేయడంతో కాసేపు సందడి నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సీఎం విజయ్ కి ఉన్న ఒకే ఒక్క టెన్షన్ అంటూ ఉదయనిధి ప్రసంగిస్తుండగా… కొంతమంది కార్యకర్తలు త్రిష.. త్రిష అంటూ నినాదాలు చేశారు. ఉదయనిధి ప్రసంగిస్తుండగా కార్యకర్తలు నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. త్రిష పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుతూ తమిళనాట పోస్టర్లు దర్శనమిస్తున్న క్రమంలో ఈ ఘటన జరగడం హాట్ టాపిక్ గా మారింది.
మదురై ప్రాంతంలో త్రిష రాజకీయ ప్రవేశాన్ని కోరుతూ పోస్టర్లు దర్శనమివ్వడం సంచలనంగా మారింది. ఈ పోస్టర్లలో త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ ఫాన్స్ డిమాండ్ చేస్తున్నట్లుంది. దీంతో త్రిష పొలిటికల్ ఎంట్రీపై ఇటు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది.