Reading Time: 3 minutes

జ్యోతిష్యం: కర్కాటకరాశిలో బుధాదిత్య రాజయోగం.. 4 రాశుల వారి జీవితం మారిపోతుంది.. 12 రాశుల వారి ఫలితాలు ఇవే..!

Caption of Image.

 ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న బుధుడు ఆగస్టు 5  నుంచి కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే అక్కడే ఉన్న సూర్యుడితో కలవడం వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.  ఈ శుభయోగం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కాని నాలుగు (మేష, మిథున, కర్కాటక, తులా ) రాశుల వారికి విశేషమైన ప్రయోజననాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.  వాటితో పాటు మిగతారాశుల వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

జ్యోతిష్యం ప్రకారం బుధగ్రహాన్ని గ్రహాల యువరాజుగా పరిగణిస్తారు. బుధుడు మేధస్సు, కమ్యూనికేషన్, సంపద, వాణిజ్యం మరియు చర్చల గ్రహంగా పరిగణిస్తారు. ఇక ఈ గ్రహాల యువరాజు స్థితిగతులు లాభదాయకంగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఆగస్టు 5 న బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించి అక్కడే ఉన్న సూర్యుడితో కలవడం వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది.  కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటే కొన్ని రాశులవారికి  అనుకూల ప్రభావం ఉంటుంది.  బుధుడి ఆశీస్సులతో స్థానికుల జీవితంలో ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. జాతకంలో బుధుని బలంతో  అవగాహన, ఆలోచనా శక్తి మెరుగ్గా ఉంటాయి. దాని ప్రభావంతో, మీరు మీ ఉద్యోగం, వ్యాపారం మరియు వ్యాపారంలో బాగా పని చేస్తారు. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం, బుధ గ్రహం సంచారం చేసినప్పుడు  12 రాశుల వారిని  ఒక రూపంలో ప్రభావితం చేస్తుంది. 

మేషరాశి :   కర్కాటక రాశిలో బుధాదిత్య రాజయోగం   వలన ఈ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. . ఈ రాశి చక్రంలో నాల్గవ ఇంట్లో బుధుడు సంచరిస్తున్నాడు.  వాహనాల కొనుగోలు ,ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆదాయ వనరులు పెరిగి ..ఖర్చులు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు.    రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆర్ధికంగా చాలా లాభాలు వస్తాయి.   ఆస్తి తగాదాల వల్ల కొంత చికాకుగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

వృషభ రాశి  : బుధాదిత్య రాజయోగం వలన  ఈ రాశి వారికి జీవితంలో పురోగతిని కలిగిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది.  నూతన వాహనం కొనుగోలు చేయడం..  ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం కూడా ఉంది.    మార్కెటింగ్ రంగం వారు  బాగా డబ్బు సంపాదించే అవకాశాన్ని పొందుతారు. తోటి ఉద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది. విదేశీ ప్రయాణం చేయాలనుకొనే వారికి  ఇది సరైన సమయం కాదు

మిధునరాశి :  ఈ రాశికి  అధిపతి బుధుడు. బుధాదిత్య రాజయోగం వలన ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. వ్యాపారస్తులకు పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు కూడా ఉంటాయి.  సమాజంలో గౌరవం పెరుగుతుంది.  మీ బ్యాంక్ బ్యాలెన్స్ క్రమంగా పెరిగే అవకాశం ఉంది.  కొత్త అతిథి రాకతో కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లికి సంబంధించిన చర్చలు కూడా సఫలమవుతాయి. శరీరం యొక్క దృఢత్వం, ముఖ్యంగా చర్మ వ్యాధులు మరియు కడుపు సంబంధిత సమస్యల గురించి జాగ్రత్తగా ఉండండి.

కర్కాటక రాశి : ఇదే రాశిలో బుధాదిత్యరాజయోగం వలన ఈ రాశికి చాలా అద్భుతంగా ఉంటుంది.  అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి.  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిత్వంలో ఆకర్షణ, మెరుగుదల కనిపిస్తుంది.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ కలుగుతుంది. ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం బాగానే ఉంటుంది. ఎప్పటినుంచో చేతికిరాదు అనుకున్న డబ్బు అనుకోకుండా అందుతుంది. వెంటాడుతున్న సమస్యలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం. అయితే దూరప్రయాణాలు చేయకపోవడమే మంచిది. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి.

►ALSO READ | ఆధ్యాత్మికం: గుడిలో ప్రదక్షిణాలు ఎందుకుచేయాలి.. ఎలాంటి నియమాలు పాటించాలి .. ఎలాంటి ఫలితం కలుగుతుంది.!

సింహ రాశి :  ఈ రాశి వారికి బుధాదిత్య రాజయోగం వలన  ఉద్యోగులకు స్థానచలనం కలిగే అవకాశం ఉంటుంది.  ఈ సమయంలో ఈ రాశివారికి ఖర్చులు అధికంగా ఉంటాయి.  స్నేహితులు ,బంధువుల నుంచి  శుభవార్తలు అందుకుంటారు.  మీరు వీసా, పాస్ పోర్ట్ కోసం  దరఖాస్తు చేసే వారికి ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటాయి.  ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. 

కన్యారాశి: కర్కాటకరాశిలో బుధుడు .. సూర్యుడితో కలవడం వలన ఈ రాశివారికి కూడా అనుకూల పరిస్థితులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా మీరు ఈ సమయంలో కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకుంటారు. కష్టానికి తగిన ఫలితం, గుర్తింపు దక్కుతాయి.  నాయకత్వ లక్షణాలు ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారంలో విజయం సాధించవచ్చు.

తులా రాశి :  ఈ రాశి  వారికి బుధాదిత్య రాజయోగం మంచి ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగం, వృత్తి, కెరీర్‌లో మంచి ఫలితాలను చూస్తారు. పనిపట్ల చురుకుదనం ఉంటుంది. ఉన్నతాధికారులు మీ పనితీరును ప్రశంసిస్తారు. ఉద్యోగం మారాలనుకుంటే ఇది అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు కూడా భారీగా లాభాలు ఉంటాయి.  కొత్త ఆదాయ మార్గాలు, సంతాన ప్రాప్తి, పట్టిందల్లా బంగారం అన్న పరిస్థితులు కలుగుతాయి.. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఢోకా లేదని పండితులు చెబుతున్నారు. 

వృశ్చిక రాశి: కర్కాటక రాశిలో బుధాదిత్య రాజయోగం వలన ఈ రాశివారికి  అనుకూల ఫలితాలు ఉంటాయి.  ఆధ్యాత్మిక విషయాలతో కాలక్షేపం చేస్తారని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు.   ఇష్టమైన  దైవ దర్శనం వారి దర్శనం చేయడం.. దానధర్మాలు చేయడానికి  ఎక్కువ ఖర్చు పెడతారట.  సోదరుల మధ్య సఖ్యత దెబ్బతినే అవకాశం ఉన్నా ఇది తాత్కాలికమే. అన్నదమ్ముల మధ్య మాట పట్టింపులకు పోకుండా జాగ్రత్తగా ఉండటం అవసరమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  

ధనుస్సు రాశి :  బుధాదిత్య రాజయోగం వలన ఈ  రాశి వారు ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది.   షేర్ మార్కెట్, బెట్టింగ్, లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం వంటివి ఆలోచించి చేయాలి.  జాయింట్ వ్యాపారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి .. కొత్త ఒప్పందాలు చేసుకోకపోవడమే మంచిది. ఆరోగ్య విషయంలో కొన్ని ఒడిదుడికులు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు సామాన్యలాభాలుంటాయి.  ఎవరితోనూ వాదన పెట్టుకోవద్దు. ప్రతి విషయంలో ఓర్పు.. సహనాన్ని పాటించండి.

మకరరాశి :  కర్కాటక రాశిలో బధాదిత్యరాజయోగం   వలన ఈ రాశి జాతకులకు చాలా ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది.  కోర్టు కేసుల్లో విజయం పొందుతారని  ఈ కాలంలో మీరు ఏదైనా చట్టపరమైన కేసులో విజయం పొందవచ్చు.. భాగస్వామ్య వ్యాపారాలు మెరుగుపడే అవకాశాలున్నాయి.  ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  ప్రమోషన్​ కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. 

కుంభ రాశి:  బుధాదిత్య రాజయోగం వలన  ఈ రాశి వారికి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం  ప్రభావం ఉంటుంది.  ఎవరికైనా ఎక్కువ డబ్బు ఇస్తే, ఆ డబ్బు సకాలంలో అందదు. విదేశీ ఉద్యోగం  కోసం చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగంలో  కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది.  ఆరోగ్య విషయంలో కండరాల నొప్పులు వంటివి తలెత్తే అవకాశం ఉంది. 

మీనరాశి:  ఈ రాశి వారికి బుధాదిత్య రాజయోగం వలన  వ్యక్తిగత జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీరు అంతర్గత శక్తిని కాపాడుకోగలుగుతారు. మీ ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు ఉండవచ్చు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.    డబ్బు లాభం పొందే అవకాశం ఉంది. అయితే  ఈ కాలంలో మీ చేతులతో వ్యాపారాన్ని ప్రారంభించకపోవడం మంచిది.  ఉద్యోగస్తులు పరిస్థితులు అనూలిస్తాయి.  ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు.  వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉటుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.  

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
 

©️ VIL Media Pvt Ltd.