Reading Time: < 1 minute

సిద్ధంబర్ బజార్లో నకిలీ గ్యాస్ స్టవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పట్టివేత

Caption of Image.

బేగంబజార్, వెలుగు: సిద్ధంబర్​బజార్​లో విక్రయిస్తున్న నకిలీ గ్యాస్​స్టవ్​లను బేగంబజార్​పోలీసులు పట్టుకున్నారు. హెచ్ బీ అండ్ కంపెనీ యజమాని షమూన్ హుస్సేన్ కొంతకాలంగా బటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లై బ్రాండ్ పేరుతో నకిలీ గ్యాస్ స్టవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇన్వెస్టిగేషన్ సర్వీసెస్ రీజినల్ హెడ్ నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో వారు సోమవారం సదరు షాపులో తనిఖీలు చేపట్టారు. సుమారు రూ.లక్ష విలువైన బటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లై పేరుతో ఉన్న 50 నకిలీ గ్యాస్ స్టవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  

©️ VIL Media Pvt Ltd.