
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ & ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 48.
విభాగాల వారీగా ఖాళీలు: రీసెర్చ్ సైంటిస్ట్ 14, ప్రాజెక్ట్ సైంటిస్ట్ & ప్రాజెక్ట్ అసోసియేట్ 15, జూనియర్ రీసెర్చ్ ఫెలో 19.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎం.టెక్, ఎంఎస్సీ/ ఎంఎస్సీ టెక్నాలజీ, బీఈ/ బి.టెక్, బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. లేదంటే 10 పాయింట్ల స్కేలులో 6.5 సీజీపీఏ కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 1.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అందరు రూ. 250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మన్, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజును రీఫండ్ చేస్తారు.
లాస్ట్ డేట్: ఆగస్టు 21.
సెలెక్షన్ ప్రాసెస్: ఎలాంటి రాత పరీక్ష ఉండదు. దరఖాస్తుల పరిశీలన తర్వాత షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.nrsc.gov.inను సందర్శించండి.