
మహబూబ్‌నగర్ రూరల్, వెలుగు: మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8 తేదీల్లో కన్హ శాంతి వనంలో నిర్వహించనున్న విజన్ ఇండియా-–2047 రెండు రోజుల జాతీయ సదస్సుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను ఆహ్వానించారు.
వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ కరీంనగర్‌లోని బండి సంజయ్ స్వగృహంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేసి సదస్సు వివరాలను వివరించారు. స్పందించిన ఆయన యువతలో జాతీయ చైతన్యం, నాయకత్వ లక్షణాలు, దేశాభివృద్ధిపై బాధ్యతాయుతమైన ఆలోచనలను పెంపొందించేందుకు ఇటువంటి సదస్సులు ఉపయోగపడతాయన్నారు.