Reading Time: < 1 minute

జగిత్యాల జిల్లాలో విషాదం.. కుంటలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి…

Caption of Image.

జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మల్యాలలో ఇద్దరు విద్యార్థులు కుంటలో మునిగి మృతి చెందారు. సోమవారం ( ఆగస్టు 3 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..మల్యాల ఎస్సీ హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు వాసం విష్ణు, శుశాంత్  కుంటలో ఈతకు వెళ్లి మృతి చెందారు. విష్ణు స్వస్థలం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ కాగా.. శుశాంత్ స్వస్థలం జగిత్యాల టీఆర్ నగర్. 

మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, డీఎస్పీ 

ఇదిలా ఉండగా.. జగిత్యాల ప్రభుత్వాసుపత్రి దగ్గర విద్యార్ధి కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మృతదేహాలను తీసుకెళ్లామని అధికారులు సూచించగా.. నిరాకరించారు కుటుంబసభ్యులు. అధికారుల తీరుపై మృతుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు మృతిపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.

మంత్రి వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మృతదేహాలు తీసుకెళ్లబోమని అంటున్నారు కుటుంబసభ్యులు. ఈ క్రమంలో మల్యాల ఎస్సీ హాస్టల్‌కు పెద్దఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు..భయాందోళనల మధ్య తమ పిల్లలను హాస్టల్ నుంచి తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.