Reading Time: 2 minutes
IRCTC పుదుచ్చేరి–మహాబలిపురం టూర్ ప్యాకేజ్: రూ.6 వేల నుంచే అద్భుత ట్రిప్.. పూర్తి వివరాలు ఇవే!

IRCTC Puducherry–Mahabalipuram Tour Package Telugu: దక్షిణ భారతదేశంలోని చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపదను ఆస్వాదించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్రత్యేకంగా “కల్చరల్ అండ్ హెరిటేజ్ ఎక్స్‌ప్లోరేషన్” పేరుతో పుదుచ్చేరి–మహాబలిపురం టూర్ ప్యాకేజ్‌ను అందిస్తోంది. ఈ రెండు రోజుల రోడ్ ట్రిప్‌లో ఫ్రెంచ్ సంస్కృతి, ఆధ్యాత్మిక కేంద్రాలు, యునెస్కో వారసత్వ కట్టడాలు, సముద్ర తీర అందాలను ఒకే ప్రయాణంలో ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.

పుదుచ్చేరి ప్రత్యేకత ఏమిటి?

ఒకప్పుడు పాండిచ్చేరిగా ప్రసిద్ధి చెందిన పుదుచ్చేరి, భారతదేశంలో ఫ్రెంచ్ పాలనకు కేంద్రంగా నిలిచింది. అందుకే దీనిని “ఫ్రెంచ్ రివేరా ఆఫ్ ది ఈస్ట్” అని కూడా పిలుస్తారు. పుదుచ్చేరి అంటే తమిళంలో “కొత్త పట్టణం” అని అర్థం. ప్రాచీన కాలంలో ఇది రోమన్ వ్యాపార కేంద్రంగా కూడా గుర్తింపు పొందింది. వేద పండితులు నివసించిన ప్రాంతంగా ఉండటంతో దీనిని ‘వేదపురి’ అని కూడా పిలిచేవారు.

మహాబలిపురం విశిష్టత

తమిళనాడులోని మహాబలిపురం (మామల్లపురం) ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక పర్యాటక కేంద్రం. పల్లవ రాజులు 7వ, 8వ శతాబ్దాల్లో నిర్మించిన అద్భుతమైన రాతి దేవాలయాలు, శిల్పాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. సముద్ర తీరాన ఉన్న షోర్ టెంపుల్, ఫైవ్ రథాస్, కృష్ణాస్ బటర్ బాల్ వంటి ప్రదేశాలు దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

ప్యాకేజ్ వివరాలు

  • ప్యాకేజ్ పేరు: కల్చరల్ అండ్ హెరిటేజ్ ఎక్స్‌ప్లోరేషన్
  • పర్యాటక ప్రాంతాలు: పుదుచ్చేరి – మహాబలిపురం
  • ప్రయాణ విధానం: ఏసీ రోడ్డు వాహనం
  • గ్రూప్ పరిమితి: గరిష్ఠంగా 10 మంది
  • టూర్ నిర్వహణ రోజులు: ప్రతి సోమవారం నుంచి బుధవారం వరకు
  • చెల్లుబాటు: 2026 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు

ప్యాకేజ్ ధరలు (ఒక్కో వ్యక్తికి)

1 నుంచి 3 మంది వరకు

  • సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.16,850
  • ట్విన్ షేరింగ్: రూ.8,750
  • ట్రిపుల్ షేరింగ్: రూ.6,350
  • చిన్నారులు (పడకతో): రూ.3,050
  • చిన్నారులు (పడక లేకుండా): రూ.2,800

4 నుంచి 6 మంది వరకు

  • ట్విన్ షేరింగ్: రూ.7,300
  • ట్రిపుల్ షేరింగ్: రూ.6,850
  • చిన్నారులు (పడకతో): రూ.5,950
  • చిన్నారులు (పడక లేకుండా): రూ.5,700

టూర్ ప్రయాణ ప్రణాళిక

మొదటి రోజు: ఉదయం 7 గంటలకు చెన్నై నుంచి బయలుదేరి, సుమారు 11 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటారు. హోటల్‌లో చెక్-ఇన్ అనంతరం ఈ కింది ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తారు. శ్రీ అరవిందో ఆశ్రమం, పుదుచ్చేరి మ్యూజియం, బొటానికల్ గార్డెన్, ఫ్రెంచ్ కాలనీ, ఓల్డ్ లైట్‌హౌస్, ఫ్రెంచ్ వార్ మెమోరియల్, ఆరోవిల్,
సెరెనిటీ బీచ్, రాత్రికి పుదుచ్చేరిలోనే బస ఏర్పాటు ఉంటుంది.

రెండో రోజు: హోటల్‌లో అల్పాహారం అనంతరం మనకుల వినాయకర్ ఆలయం, ఆరోవిల్ మాతృమందిర్ సందర్శించి మహాబలిపురం చేరుకుంటారు. అక్కడ ప్రసిద్ధ షోర్ టెంపుల్, ఫైవ్ రథాస్ (పంచరథాలు) వంటి చారిత్రక కట్టడాలను వీక్షించిన అనంతరం రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటారు.

ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు

  • పుదుచ్చేరిలో ఒక రాత్రి ఏసీ హోటల్ వసతి
  • మొత్తం ప్రయాణానికి ప్రత్యేక ఏసీ వాహనం
  • రెండో రోజు హోటల్‌లో అల్పాహారం
  • షెడ్యూల్ ప్రకారం అన్ని సందర్శనల ఏర్పాటు
  • ట్రావెల్ ఇన్సూరెన్స్
  • టోల్, పార్కింగ్, వర్తించే పన్నులు

ప్యాకేజీలో లేని సేవలు

  • రైలు లేదా విమాన టికెట్లు
  • పర్యాటక ప్రదేశాల ప్రవేశ రుసుములు
  • గైడ్ సేవలు
  • భోజన ఖర్చులు (పేర్కొన్న అల్పాహారం మినహా)
  • కెమెరా ఫీజులు
  • వ్యక్తిగత ఖర్చులు
  • లాండ్రీ, మినరల్ వాటర్, టెలిఫోన్ తదితర సేవలు
  • ప్రణాళికలో లేని అదనపు సేవలు

ప్రయాణికులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు

  • వాతావరణం, రోడ్డు పరిస్థితులను బట్టి సందర్శనల్లో మార్పులు ఉండవచ్చు.
  • సహజ విపత్తులు లేదా సామాజిక పరిస్థితుల వల్ల ఏర్పడే అంతరాయాలకు ఐఆర్‌సీటీసీ బాధ్యత వహించదు.
  • హోటల్ గదుల లభ్యతను బట్టి సమాన స్థాయి హోటల్‌ను కేటాయిస్తారు.
  • వాహనం రకం గ్రూప్‌లోని సభ్యుల సంఖ్యను బట్టి నిర్ణయిస్తారు.
  • ముందస్తు చెక్-ఇన్, ఆలస్యంగా చెక్-అవుట్ హోటల్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది.
  • గుండె జబ్బులు, రక్తపోటు, గర్భిణీలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో పాటు సహాయకుడితో ప్రయాణించడం మంచిది.
  • రద్దు నిబంధనలు సంస్థ పాలసీ ప్రకారం అమలులో ఉంటాయి.

ఫ్రెంచ్ శైలి వీధులు, ప్రశాంతమైన బీచ్‌లు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక దేవాలయాలు, యునెస్కో వారసత్వ కట్టడాలను ఒకే టూర్‌లో చూడాలనుకునే వారికి ఈ పుదుచ్చేరి–మహాబలిపురం ప్యాకేజ్ అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.

ఐఆర్‌సీటీసీ కల్చరల్ అండ్ హెరిటేజ్ ఎక్స్‌ప్లోరేషన్ టూర్ ప్యాకేజీ మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.