
టాలీవుడ్ హీరోలు కేవలం కెమెరా ముందే కాదు, కెమెరా వెనుక కూడా తమ సత్తా చాటుతున్నారు. సొంత బ్యానర్లు స్థాపించి తమ కోసం కాకుండా ఇతర హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తూ బిజీగా మారిపోతున్నారు. ఈ కొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్న వారిలో చాలా మంది ఉన్నారు.నాని కేవలం హీరోగానే కాకుండా బిజీగా ఉండే నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా, హిట్ ఫ్రాంచైజీ, కోర్ట్ వంటి సినిమాలతో గుర్తింపు పొందారు. తాజాగా నితిన్‌తో యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఒక సినిమాకు, చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అఖిల్‌తో లెనిన్ సినిమా నిర్మించి విజయం సాధించారు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా రంభ ఊర్వశి మేనక అనే ఆసక్తికరమైన సినిమాను నిర్మిస్తున్నారు.రామ్ చరణ్ కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఉన్నప్పటికీ, వి మెగా పిక్చర్స్ బ్యానర్ స్థాపించి నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్‌తో జై లవకుశ నిర్మించారు, అలాగే రవితేజతో కిక్ 2 నిర్మించారు. ఇప్పుడు డ్రాగన్తో పాటు, నెక్స్ట్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయబోయే సినిమాకు సహ నిర్మాతగా ఉన్నారు. యువ హీరో కిరణ్ అబ్బవరం సైతం నిర్మాతగా మారి, తన కెమెరా అసిస్టెంట్ సాయి తేజ్‌ను హీరోగా పెట్టి తిమ్మరాజుపల్లి సినిమా నిర్మించారు.