Reading Time: < 1 minute
Nani Success Story From Assistant Director To Producer For Nithiin Alias Rukmini

Nani – Nithiin: న్యాచురల్ స్టార్ నాని సినీ ప్రయాణం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హీరోగా వరుస విజయాలతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న నాని.. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సినీ పరిశ్రమలో నిర్మాతగా ఎదిగి తోటి హీరోలతో సినిమాలను నిర్మిస్తుండటం విశేషం. 20 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోగా అవకాశాలు రాకముందు నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన చిత్రాల్లో 2005లో నితిన్ హీరోగా విడుదలైన ‘అల్లరి బుల్లోడు’ కూడా ఒకటి.

ఆ సమయంలో కెమెరా వెనుక పనిచేసిన నాని.. తర్వాత కాలంలో తన కష్టంతో, పట్టుదలతో తర్వాత హీరోగా అవకాశాన్ని అందుకుని, టాలీవుడ్‌లో న్యాచురల్ స్టార్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పరిస్థితులు పూర్తిగా మార్చుకుంటూ.. స్టార్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటుతున్న నాని.. నితిన్ హీరోగా తెరకెక్కబోతున్న ‘అలియాస్ రుక్మిణీ’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు నితిన్ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాని.. నేడు అదే హీరో సినిమాను నిర్మించే స్థాయికి ఎదగడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. “ఇదే నిజమైన సక్సెస్ స్టోరీ”, “కష్టపడితే అసాధ్యం అనేది ఏదీ లేదు”, “అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ హీరో, నిర్మాత వరకు నాని ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తి” అంటూ కామెంట్లు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాని కెరీర్‌లో ఈ అరుదైన మైలురాయి ఆయన సినీ ప్రయాణానికి మరో ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.