
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలనుప్రపంచదేశాలతో పాటు సొంత అమెరికన్లు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేస్తున్నారు. రెండోసారి పాలన చేపట్టినప్పటినుంచి ప్రపంచ దేశాలపై ఏదో ఒక రూపంలో పన్నులు విధుస్తూనే ఉన్నారు ట్రంప్. ఈక్రమంలో ప్రపంచ దేశాలు ట్రంప్ టారిఫ్ విధానాలను వ్యతిరేకిస్తుండగా.. అమెరికన్ ప్రజలు కూడా తమ వ్యాపారాలపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 60దేశాలపై ట్రారీఫ్ విధించడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని 25 రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టులో దావా వేశాయి.
భారత్ సహా 60 దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త టారిఫ్ లకు వ్యతిరేకంగా అమెరికాలోని 25 డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని, అమెరికా ప్రజలు, వ్యాపారాలపై తీవ్రభారం చూపుతాయని ఆరోపించాయి.
ఇంతకుముందు కూడా అమెరికా ఫెడరల్ కోర్టు ట్రంప్ విధించిన ప్రపంచ సుంకాల్లో కొన్నింటిని రద్దు చేసింది. అధ్యక్షుడికి ఉన్న అధికార పరిమితులను మించి ఈ సుంకాలు విధించారని కోర్టు పేర్కొంది.
భారత్‌పై మొదట 12.5 శాతం సుంకం విధించే ప్రతిపాదన ఉన్నప్పటికీ, కార్మిక విధానాల్లో మార్పులు, అమెరికాతో చర్చల కారణంగా దాన్ని 10 శాతానికి తగ్గించారు. దీంతో వస్త్రాలు, ఫార్మా, ఆటో విడిభాగాలు వంటి భారత ఎగుమతి రంగాలకు కొంత ఊరట లభించింది.
అయితే, ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ సుంకాల నిర్ణయం అమెరికాలోనే రాజకీయ వివాదానికి దారితీసింది. సుంకాలపై కోర్టు పోరాటం ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపే అంశంగా మారింది.