Reading Time: < 1 minute

‘దొంగ నా కొడుకు’గా రాబోతున్న మౌళి.. ‘లిటిల్ హార్ట్స్’ స్టార్‌తో మైత్రీ మూవీ మేకర్స్ భారీ ప్లాన్!

Caption of Image.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో మొదలైన ప్రయాణం .. ఇప్పుడు టాలీవుడ్ లో హీరోగా దూసుకెళ్తున్నాడు. తన కామెడీ టైమింగ్, డిఫరెంట్ కంటెంట్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న మౌళి.. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. ‘లిటిల్ హార్ట్స్’ విజయంతో తన సత్తా చాటిన ఈ యంగ్ టాలెంట్ హీరో.. ఇప్పుడు మరింత క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మౌళి రెండో సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ‘దొంగ నా కొడుకు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ ప్రకటించడమే కాదు..  లేటెస్ట్ గా  ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటోంది. పోస్టర్ చూస్తుంటే ఇది రెగ్యులర్ కామెడీ కాదు.. ట్విస్టులు, సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో నిండిన ఫుల్ ఎంటర్‌టైనర్ అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మౌళి సరసన సుస్మితా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, అవుట్ అండ్ అవుట్ రాబరీ క్రైమ్ కామెడీగా సినిమాను రూపొందిస్తున్నారు. సంగీతాన్ని సిన్జిత్ ఎర్రమిల్లి అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను సూర్య బాలాజీ నిర్వహిస్తున్నారు. ఇక టైటిల్‌పై మౌళి చేసిన కామెంట్ మరింత ఆసక్తిని పెంచుతోంది. ‘ఈసారి కామెడీ మాత్రమే కాదు… ఊహించని ట్విస్టులు కూడా ఉంటాయి. టైటిల్ కమర్షియల్‌గా అనిపించొచ్చు. కానీ సినిమాలో దాని వెనుక బలమైన కథ ఉంది. త్వరలో థియేటర్లలో కలుద్దాం’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. తొలి సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న మౌళి… ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్ అండతో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడా? అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

 

©️ VIL Media Pvt Ltd.