Reading Time: 2 minutes
ఈ పిచ్చి డ్రెస్సులు ఏంటి..? పిచ్చి పాటలు ఏంటి.? అనుకున్నా.. కానీ కృష్ణగారి దెబ్బకు ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది

ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమాకు పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. ఇటీవల నెంబర్ వన్ సినిమా నిర్మాణ అనుభవాలు, తన కెరీర్‌లో విజయానికి మూలసూత్రాలను ఆయన వివరించారు. దొంగ సినిమా తర్వాత సూపర్‌స్టార్ కృష్ణతో నెంబర్ వన్ తీస్తున్న సమయంలో, కృష్ణ గారి విభిన్నమైన డ్రెస్సింగ్, పాటలు చూసి తాను ఆశ్చర్యపోయానని ఎస్.వి.కృష్ణారెడ్డి తెలిపారు. “ఈ పిచ్చి డ్రెస్సులు ఏంటి? పిచ్చి పాటలు ఏంటి.? కృష్ణ గారికి ఏం పోయే కాలం వచ్చింది.? ఈ సినిమా ఎలా ఆడుతుంది.?” అని మనసులో అనుకున్నానని, కృష్ణతో చార్లీ చాప్లిన్ గెటప్ కూడా చేయించారని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో తన సందేహాలను సహ దర్శకుడు శరత్‌తో పంచుకోగా, “లేదన్నయ్యా, బాగా వస్తుంది చూడు” అని శరత్ భరోసా ఇచ్చారని ఎస్.వి.కృష్ణారెడ్డి పేర్కొన్నారు. చిత్రం విడుదలైన తర్వాత అది న భూతో న భవిష్యతి అన్నట్లుగా అనూహ్య విజయం సాధించి, కృష్ణ గారి కెరీర్‌లో మూడు కంటిన్యూస్ పండగ సక్సెస్‌లలో ఒకటిగా నిలిచిందని తెలిపారు.

ఇది కూడా చదివేసేయండి : అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడు ఇలా

ఇటువంటి విలక్షణమైన కథలను, ఆలోచనలను ఎలా కన్సీవ్ చేస్తారని ప్రశ్నించగా, తన విజయానికి “విశ్వాసమే” ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. “జనానికి ఆకట్టుకుంటది అన్నటువంటి నమ్మకం గనుక మీకు ఉన్నట్టయితే, ఆ నమ్మకం 100శాతం మిమ్మల్ని తీసుకెళ్ళిపోద్దండి” అని తెలిపారు.  ఎం.ఎల్.ఏ సినిమా, బాబు మోహన్‌తో డాన్స్, ఆలీతో చేసిన చిత్రాలు వంటివి కేవలం ఈ విశ్వాసం వల్లే సాధ్యమయ్యాయని ఆయన ఉదాహరణలతో వివరించారు. స్వంతంగా సినిమాలు నిర్మించడం గురించి మాట్లాడుతూ, తాను స్వంతంగా సినిమా తీయగల సామర్థ్యం ఉన్నప్పటికీ, ఆ అభిప్రాయం లేదని ఎస్.వి.కృష్ణారెడ్డి తెలిపారు. తన ప్రొడక్షన్ మేనేజర్‌తో సహా అందరూ కలిసి స్వంతంగా సినిమాలు చేద్దామా అని చర్చించినప్పుడు, “లేదు, మనం చేయడం కరెక్ట్ కాదు. మనం ఎవరికైనా బయటకి చేయడం, ఎంత వస్తే అంత తీసుకోవడం” అని ఒక సలహా వచ్చిందని, దానిని అనుసరిస్తున్నానని చెప్పారు.

ఇది కూడా చదివేసేయండి : సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు

స్వంతంగా చేసినవాటిల్లో కొన్ని నష్టాలు కూడా చూశామని, ఈ వయసులో మళ్ళీ పెట్టుబడి పెట్టడం అవసరమా అని ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు. హిట్‌ల తర్వాత హిట్‌లు చేసుకుంటూ వెళ్ళడం మంచిదని, దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరని అభిప్రాయపడ్డారు. ఒక డైరెక్టర్, కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం, డైలాగ్‌లు అన్నీ తానే చేస్తే, మరింత క్యాష్ చేసుకోవచ్చని, విజయం సాధించడం సులభమని ఆయన అన్నారు. తన ఆలోచనలు, కథా రచన, దర్శకత్వం వంటివన్నీ తన అధీనంలో ఉన్నప్పుడు, 100శాతం అద్భుతమైన విజయాన్ని అందించగలనని, దీనికి విశ్వాసం ఒక్కటే ముఖ్యమని అన్నారు. అయితే, కేవలం దర్శకుడి విశ్వాసమే కాకుండా, నిర్మాత విశ్వాసం కూడా ముఖ్యమని, ప్రస్తుత వాణిజ్య ప్రపంచంలో అటువంటి నిర్మాతలు దొరకడం కష్టమని కృష్ణ రెడ్డి అన్నారు.

ఇది కూడా చదివేసేయండి : ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్‌లో దగ్గరుండి మరీ చూసేవారట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.