Reading Time: < 1 minute

ప్రధాని మోడీని తిట్టిన బాలికపై కేసు క్లోజ్

Caption of Image.

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల బాలికపై నమోదైన కేసును ఢిల్లీ పోలీసులు ఉపసంహరించుకున్నారు. ఇటీవల ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. 

ఈ సమయంలో బాలిక ప్రధాని మోదీని దూషిస్తూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పోలీసులు జీరో ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత క్షమాపణలు చెబుతూ ఆ బాలిక మరో వీడియో విడుదల చేసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని క్షమిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దీంతో బాలికపై కేసును కొనసాగించకూడదని ఢిల్లీ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.