Reading Time: < 1 minute

మాజీ గవర్నర్ DY పాటిల్ కన్నుమూత

Caption of Image.

ముంబై: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పశ్చిమ బెంగాల్, బీహార్ మాజీ గవర్నర్ డీవై పాటిల్ (90) కన్నుమూశారు. వయోభారం, పలు అనారోగ్య సమస్యలతో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని తన నివాసంలో మంగళవారం (ఆగస్ట్ 4) ఆయన తుది శ్వాస విడిచారు. డీవై పాటిల్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

1935, అక్టోబర్ 22న జన్మించిన డీవై పాటిల్ తన విశిష్ట ప్రజా జీవితంలో త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. ప్రజా సేవ, విద్య, సామాజిక సంక్షేమానికి ఆయన విశేష సేవలందించారు. విద్యా, సామాజిక సేవా రంగాలలో చేసిన కృషికి గాను 1991లో ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 

©️ VIL Media Pvt Ltd.