Reading Time: < 1 minute

‘ఈ అమ్మాయి గురించి ఏంట్రా ఇంత ఆలోచిస్తున్నావ్’.. ఆకట్టుకుంటున్న మాయ లేడి గ్లింప్స్

Caption of Image.

ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్న హీరో, నిర్మాత రాకేష్‌‌‌‌ వర్రే.. త్వరలో ‘మాయ లేడి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తను హీరోగా నటిస్తూ, క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నిర్మిస్తున్న  ఈ చిత్రానికి ప్రశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. మధుమిత సర్కార్ హీరోయిన్. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. సోమవారం ఈ మూవీ గ్లింప్స్‌‌‌‌ను విడుదల చేశారు. 

‘ఈ అమ్మాయి గురించి ఏంట్రా ఇంత ఆలోచిస్తున్నావ్’ అని తల్లి అడుగుతుంటే.. ‘ఏంటో అమ్మా ఈ అమ్మాయి తెలిసేకొద్దీ ఇంకా ఇంకా నచ్చేస్తోంది’ అని హీరో బదులిస్తాడు.  ఎవరైనా మన మధ్యకు వస్తే ఊరుకోను అంటూ  హీరోయిన్‌‌‌‌ హెచ్చరించడంతో తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ ఎంత వైలెంట్‌‌‌‌గా ఉండబోతోందో చూపించారు.  వీడియో చివర్లో హీరో చెప్పిన ‘ఇప్పుడు నా లవ్ స్టోరీలో విలన్ ఎవరో తెలుస్తోంది..’ అనే డైలాగ్‌‌‌‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  
 

©️ VIL Media Pvt Ltd.